|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 10:29 AM
అజిత్ పవార్ ప్రయాణించిన విమానం ప్రమాదానికి గురైన ఘటనపై డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) విచారణ చేపట్టింది. ప్రమాదానికి గల కారణాలను అన్వేషించేందుకు డీజీసీఏ, ఫోరెన్సిక్ బృందం ఘటనాస్థలంలో తనిఖీలు నిర్వహించాయి.అయితే అప్పటికే పరిస్థితి చేజారిపోవడంతో విమానంలో ఉన్నవారంతా విగతజీవులుగా మారారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారి ఈ ఘటన గురించి వివరిస్తూ.. కాక్‌పిట్‌లో చివరి మాటల గురించి వెల్లడించారు.ప్రమాద ఘటన పై దర్యాప్తును విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) చేపట్టింది. బ్లాక్ బాక్స్‌ను విశ్లేషిస్తోంది. బ్లాక్‌బాక్స్‌ను ఫ్లైట్ రికార్డర్ అని కూడా పిలుస్తారు. ఇది విమాన ప్రయాణం గురించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసే కీలక పరికరం. విమాన సమాచారాన్ని రికార్డు చేయడంతోపాటు అది కూలడానికి ముందు కాక్‌పిట్‌లో జరిగిన సంభాషణలు, అక్కడి నుంచి వెలువడిన శబ్దాలను కూడా నమోదు చేస్తుంది.
Latest News