|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 12:40 PM
మహిళా ఉద్యోగినిపై ఏడాదిన్నర కాలంగా అత్యాచారం, బెదిరింపులు, మానసిక హింసకు పాల్పడిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చర్యలు అత్యంత దుర్మార్గమని వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అధికార మదంతో ఎమ్మెల్యేలు మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆమె మాట్లాడుతూ... “రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ కీచక పర్వం దేశం మొత్తం చూసింది. ఆయనపై విడుదలైన వీడియోలు జుగుప్సాకరంగా ఉన్నాయి. ఒక మహిళా ఉద్యోగినిని ట్రాప్ చేసి, లోబరుచుకొని అత్యాచారం చేయడం, గర్భవతి అయ్యాక అబార్షన్ చేయించడం, బెదిరింపులు, దాడులు చేయడం చూశాం. ఈ ఘటనలు చూస్తే కూటమి ఎమ్మెల్యేలు ఎంత బరితెగించారో అర్థమవుతోంది. గత 20 నెలలుగా కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఆ పార్టీ కార్యకర్తలు తప్పుడు పనులు చేస్తే చట్టం శిక్షిస్తుందనే భయం లేకుండా మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, వేధింపులు జరుగుతున్నా ఒక్కరిపై కూడా గట్టి చర్యలు లేవు. బాధితులపైనే తప్పుడు కేసులు పెడుతున్నారు అని మండిపడ్డారు.
Latest News