|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 12:36 PM
రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో అంచనాలు దారుణంగా పెంచేసి తెచ్చిన అప్పులన్నీ కమీషన్ల పేరుతో దోచుకోవడం తప్ప, సీఎం చంద్రబాబు చేస్తున్నదేమీ లేదని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో నిత్యం జరుగుతున్నది కంపచెట్లు తొలగించడం, గుంటల్లో నీరు తోడే పనులు మాత్రమేనని ఆయన తెలిపారు. మొదటిదశ భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వకుండా, రెండో దశ భూసమీకరణకు పూనుకోవడం దారుణమని తేల్చి చెప్పారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే తమ పార్టీ లక్ష్యమని, మూడు ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. జగన్ నామ జపం చేయకుండా కూటమి నాయకులకు రోజు గడవడం లేదని, అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కన పెట్టి, కేవలం కట్టుకథలతో డైవర్షన్ పాలిటిక్స్‌కు అలవాటు పడ్డారని ధ్వజమెత్తారు. ఇంకా, నాడు జగన్‌గారు చేసిన మంచి పనులను తనవిగా చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు, నిర్లజ్జగా క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆక్షేపించారు.
Latest News