|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 03:51 PM
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. శుక్రవారం నుంచి ఆయన పార్టీ శాసనసభ్యులతో వన్ టూ వన్ భేటీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. ఈ సమావేశాల పరంపర మండలి బుద్ధప్రసాద్‌తో మొదలైంది.ఈ సమీక్షల్లో భాగంగా, ప్రతి నియోజకవర్గంలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరు, కొనసాగుతున్న ప్రాజెక్టుల వివరాలను పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకోనున్నారు. అదేవిధంగా, నియోజకవర్గాల్లో ఇంకా పరిష్కారం కాని సమస్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలపై ఎమ్మెల్యేలతో చర్చిస్తారు.ఈ రోజు మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు. మండలి బుద్ధ ప్రసాద్ అనంతరం దేవ వరప్రసాద్, లోకం నాగ మాధవి, గిడ్డి సత్యనారాయణ, పంతం నానాజీ, సీహెచ్ వంశీకృష్ణ, నిమ్మక జయకృష్ణ, పంచకర్ల రమేశ్ బాబు, సుందరపు విజయ్ కుమార్ లతో ఆయన ముఖాముఖి భేటీ అవుతారు.
Latest News