|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 09:02 AM
దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాపై పిడుగు పడిన దృశ్యం ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ అరుదైన వీడియోను స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.భారీ వర్షం, ఉరుముల శబ్దాల మధ్య ఆకాశంలోంచి వచ్చిన ఓ పిడుగు నేరుగా బుర్జ్ ఖలీఫా పైభాగాన్ని తాకిన దృశ్యం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఫోటోగ్రఫీ, ప్రకృతి పట్ల ఆసక్తి ఉన్న షేక్ హమ్దాన్, ఈ పోస్ట్‌కు 'దుబాయ్' అని చిన్న క్యాప్షన్ మాత్రమే ఇచ్చారు. ఆయనను 'ఫజ్జా' అనే పేరుతో కూడా పిలుస్తారు.ప్రస్తుతం యూఏఈలో వాతావరణం అస్థిరంగా ఉంది. 'అల్ బషాయర్' అల్పపీడనం కారణంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
Latest News