|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 09:31 PM
ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన కుటుంబ సభ్యులపై చేసిన ఓ సరదా వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన తండ్రి, తల్లి, భార్య వరుసగా ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకోవడంతో, వారితో పోటీపడటం ఏ ఎన్నికల కన్నా కష్టంగా ఉందని ఆయన చమత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు 'ఎకనామిక్ టైమ్స్' పత్రిక ప్రతిష్ఠాత్మక 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025' పురస్కారాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో లోకేశ్ స్పందిస్తూ, "నాన్న 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు గెలుచుకున్నారు. అమ్మ 'గోల్డెన్ పీకాక్' అవార్డును ఇంటికి తీసుకొచ్చారు. నా భార్య దేశంలోనే 'అత్యంత శక్తిమంతమైన వ్యాపారవేత్తల్లో' ఒకరిగా నిలిచారు. ఈ కుటుంబంతో పోటీ పడటం ఏ ఎన్నికల కన్నా కష్టమని నేను తెలుసుకుంటున్నాను అని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.ఇటీవలే లోకేశ్ మాతృమూర్తి నారా భువనేశ్వరి లండన్‌లో జరిగిన కార్యక్రమంలో 'గోల్డెన్ పీకాక్' అవార్డును స్వీకరించారు. అదేవిధంగా, ఆయన అర్ధాంగి నారా బ్రహ్మణి 'మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్' పురస్కారాన్ని అందుకున్నారు. ఇప్పుడు చంద్రబాబుకు కూడా అరుదైన గౌరవం దక్కడంతో, నారా లోకేశ్ చేసిన ఈ ఫన్నీ కామెంట్ ప్రాధాన్యత సంతరించుకుంది. కుటుంబ సభ్యుల విజయాలను ఉటంకిస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Latest News