|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 03:06 PM
సౌదీ అరేబియా అనగానే మనకు ఎడారులు, వేడి వాతావరణం గుర్తుకొస్తుంది. కానీ, అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఎడారి దేశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. రోడ్లు, ఇళ్లు, వాహనాల పైకప్పులు మంచుతో పూర్తిగా కప్పబడిపోయాయి. రహదారులన్నీ తెల్లటి తివాచీ పరిచినట్లు కనువిందు చేస్తున్నాయి. ఈ ఊహించని మంచు వర్షాన్ని చూసి స్థానిక ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు.ఇటీవల సౌదీలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా మంచు కురవడం అక్కడి వాతావరణంలో వస్తున్న మార్పులకు సంకేతంగా నిలుస్తోంది.
Latest News