|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 02:51 PM
రాష్ట్ర పర్యాటక రంగాన్ని దేశీయంగా అగ్రస్థానంలో నిలిపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. దేశంలోని ప్రముఖ పర్యాటక నిర్వాహకుల సంఘం 'అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (ADTOI)' సహకారంతో విశాఖపట్నం వేదికగా "ఏడీటీవోఐ నేషనల్ టూరిజం మార్ట్ 2025"ను నిర్వహించనుంది. ఈ మెగా ఈవెంట్‌ను 2026 ఫిబ్రవరి 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు.సచివాలయంలోని తన కార్యాలయంలో ఏడీటీవోఐ ప్రతినిధులతో మంత్రి దుర్గేశ్, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అద్భుతమైన తీరప్రాంతం, మౌలిక వసతులున్న విశాఖ ఈ జాతీయ స్థాయి కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలోని కోస్టల్, ఆధ్యాత్మిక, ఎకో-అడ్వెంచర్, ఏజెన్సీ పర్యాటక ప్రాంతాలను జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి ఇది ఒక గొప్ప వేదిక అవుతుందని తెలిపారు.
Latest News