|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 01:07 PM
ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ నిజాలు మాట్లాడాలని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సూచించారు. ప్రజా స్పందనను గౌరవించి పీపీపీ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా ఇవాళ వైయస్ జగన్ కోటి సంతకాల ప్రతుల వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పీపీపీ (పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంతో వైద్య విద్య, వైద్యం పూర్తిగా ప్రైవేట్‌పరం అయిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. పీపీపీ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో వెల్లువెత్తిన ఆగ్రహానికి నిదర్శనంగా రెండు నెలల్లోనే కోటి 4 లక్షల 11 వేల 136 మంది సంతకాలు చేశారని అమర్నాథ్ గుర్తు చేశారు. “కోటి మందికి పైగా ప్రజలు సంతకాలు చేశారంటే, పీపీపీ విధానంపై ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారో స్పష్టంగా తెలుస్తోంది. అయినా ప్రభుత్వం కళ్లు మూసుకుని ముందుకెళ్తోంది” అని విమర్శించారు. “ప్రజల గళాన్ని పట్టించుకోకపోతే, అవసరమైతే పీపీపీ విధానంపై మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం” అని స్పష్టం చేశారు.
Latest News