|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 11:01 PM
తమకంటూ సొంత ఇల్లు, అందులో ఓ కారు ఉండాలని సగటు మధ్య తరగతి ప్రజలు ఆలోచిస్తుంటారు. చాలా మంది బ్యాంకులో వెహికల్ లోన్ తీసుకుని కారు కొనుగోలు చేస్తుంటారు. నెల నెలా ఈఎంఐ చెల్లిస్తూ కారు లోన్ తీరుస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో వివిధ ఆదాయ వర్గాలకు అనేక మోడళ్ల కార్లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకులు సైతం చాలా సులభంగా రుణాలు ఇస్తున్నాయి. దీంతో కార్లు కొనే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. క్రెడిట్ స్కోర్ 750కి పైగా ఉన్న వారికి బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే లోన్స్ ఇస్తుంటాయి.
లోన్ టెన్యూర్ గరిష్ఠంగా 7 సంవత్సరాల వరకు ఉంటుంది. చాలా బ్యాంకులు కారు ఆన్ రోడ్ ధరలో 80-90 శాతం వరకు లోన్ మంజూరు చేస్తుంటాయి. కొన్ని బ్యాంకులు కారు విలువపై 100 శాతం వరకు కూడా రుణాలు అందిస్తుంటాయి. లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లతో పాటు బ్యాంకు పాలసీల ప్రకారం ప్రాసెసింగ్ ఫీ, ఇతర ఛార్జీల వంటివి ఉంటాయి. తక్కువ వడ్డీ రేట్లు ఉన్న బ్యాంకులో లోన్ తీసుకోవడం ద్వారా లోన్ ఈఎంఐ భారం తగ్గుతుంది. నెల నెలా భారీగా ఆదా అవుతుంది. కారు లోన్ భారం కాదు.
ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో వార్షిక వడ్డీ రేటు 7.45 శాతం నుంచి మొదలవుతోంది. అన్ని బ్యాంకుల్లో ఇదే అత్యల్పంగా చెప్పవచ్చు. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి ఈ కనిష్ఠ వడ్డీ రేటుతో లోన్ ఇస్తారు. ప్రతి రూ.1 లక్ష లోన్ పై 7 ఏళ్ల కాల వ్యవధికి ఈఎంఐ రూ.1,531గా పడుతుంది.
బజాజ్ ఫిన్ సర్వ్‌లో వార్షిక వడ్డీ రేటు 7.50 శాతం నుంచి మొదలవుతోంది. ప్రతీ రూ.1 లక్ష లోన్‌పై రూ.1534 ఈఎంఐ పడుతుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో ప్రస్తుతం వడ్డీ 7.60 శాతం నుంచి ప్రారంభమవుతుండగా లక్షకు ఈఎంఐ రూ.1539గా ఉంది.
కెనరా బ్యాంకులో 7.70 శాతం నుంచి వడ్డీ మొదలవుతోంది. ఇందులో లక్షకు నెలవారీ ఈఎంఐ రూ.1544 నుంచి ఉంటుంది.
యూనియన్ బ్యాంకులో వడ్డీ రేటు 7.80 శాతం నుంచి మొదలవుతోంది. ప్రతీ లక్షకు ఈఎంఐ రూ.1549 నుంచి మొదలవుతుంది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో వడ్డీ రేటు 7.80 శాతం నుంచి ప్రారంభమవుతోంది. లోన్ ఈఎంఐ రూ.1549గా ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేటు 7.85 శాతం వడ్డీ రేటు నుంచి మొదలవుతుండగా నెలవారీ ఈఎంఐ రూ.1551గా ఉంటుంది.
Latest News