|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 10:43 AM
2025 సంవత్సరం ముగింపు నేపథ్యంలో కియా ఇండియా వినియోగదారుల కోసం 'ఇన్‌స్పైరింగ్ డిసెంబర్' పేరుతో ప్రత్యేక సేల్స్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. డిసెంబర్ 2025 అంతటా అమల్లో ఉండే ఈ ఆఫర్ కింద ఎంపిక చేసిన కియా మోడళ్లపై గరిష్ఠంగా రూ.3.65 లక్షల వరకు డిస్కౌంట్ లభించనుంది. కియా సెల్టోస్, సోనెట్, కారెన్స్, సైరోస్, కార్నివాల్ వంటి మోడళ్లపై క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనసులు, లాయల్టీ బెనిఫిట్స్, కార్పొరేట్ ఆఫర్లు వర్తిస్తాయి. ఆఫర్లు మోడల్, వేరియంట్, స్టాక్ లభ్యత ఆధారంగా మారవచ్చని, పరిమిత కాలం వరకే వర్తిస్తాయని స్పష్టం చేశారు.
Latest News