|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 10:22 AM
పెద్దకడబూరు మండలంలోని చిన్నతుంబళం గ్రామంలో రాజు అనే వ్యక్తి బుడిజగ్గుల లక్ష్మి అనే మహిళపై దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి మంగళవారం తెలిపారు. పాత గొడవల నేపథ్యంలో లక్ష్మి ఇంట్లోకి చొరబడి కాళ్లు చేతులతో కొట్టి దూషించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. కర్నూలు, మంత్రాలయం ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
Latest News