|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 07:42 PM
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో అమెరికా కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. మంగళవారం నాడు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా వివిధ రంగాల్లో సహకారం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ఇరువురు తమ ఆలోచనలను పంచుకున్నారు. పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరంపై చర్చించినట్లు సమాచారం.ఈ సమావేశంలో లారా విలియమ్స్‌తో పాటు యూఎస్ ఎంబసీకి చెందిన మెరెడిత్ మెట్జలర్, పబ్లిక్ డిప్లమసీ ఆఫీసర్ అబ్దుల్ రెహ్మన్ హబీబ్, పొలిటికల్ స్పెషలిస్ట్ శ్రీమాలి కారి, ఎకనమిక్ స్పెషలిస్ట్ శిబా త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. రాజకీయ, ఆర్థిక రంగ నిపుణులు ఈ భేటీలో పాల్గొనడం గమనార్హం
Latest News