|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 07:33 PM
రేపల్లె పట్టణంలోని తెదేపా కార్యాలయంలో మంగళవారం, మంత్రి అనగానే సత్యప్రసాద్ 41 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద రూ. 86 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ కింద మొత్తం రూ. 10 కోట్లు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో రోగులకు సహాయ నిధి కూడా సక్రమంగా అందలేదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పంతాన్ని సాయికుమార్, గూడపాటి శ్రీనివాసరావు, మేక రామకృష్ణ పాల్గొన్నారు.
Latest News