సిడ్నీ ఉగ్రదాడి కేసులో షాకింగ్ ట్విస్ట్.. లైసెన్స్డ్ తుపాకులతోనే కాల్పులు
 

by Suryaa Desk | Mon, Dec 15, 2025, 09:13 PM

ఆస్ట్రేలియా మొత్తాన్ని ఒక్కసారిగా వణికించిన సిడ్నీలోని బాండీ బీచ్‌లో దాడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తంగా 16 మంది అమాయకుల ప్రాణాలు తీసిన తండ్రీకొడుకులు.. ఉగ్రవాదులు అని పోలీసులు గుర్తించారు. అయితే ఆదివారం సాయంత్రం 6.47 గంటలకు ఈ ఘటన జరగ్గా.. ఆ సమయంలో వార్షిక హనుక్కా వేడుకలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా ఈ కార్యక్రమంలో 1000 మంది పాల్గొనగా.. 16 మంది చనిపోయారు. మరెంతో మంది గాయపడ్డారు. అయితే ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. ఈదాడికి వినియోగించిన తుపాకులు చట్టబద్ధంగా లైసెన్స్ పొందినవని తెలుసుకుని అధికారులు షాక్ అయ్యారు.


తండ్రీ కొడుకులు ఇద్దరూ.. గుంపులుగా ఉన్న జనాలపైకి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దీంతో 10 సంవత్సరాల వయసు నుంచి 87 సంవత్సరాల వయస్సు గల 16 మంది మరణించారు. బాధితులలో అత్యంత చిన్నవారైన 10 ఏళ్ల బాలిక.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మరో 42 మంది గాయాలపాలై ఆసుపత్రిలో చేరగా.. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పుల సమయంలో గాయపడిన ఇద్దరు పోలీసు అధికారులు కూడా బాధితుల్లో ఉన్నారు.


మరోవైపు దాడికి పాల్పడ్డ 50 ఏళ్ల సాజిద్ అక్రమ్ పోలీసులతో జరిగిన కాల్పుల్లో మరణించాడు. 24 ఏళ్ల కొడుకు నవీద్ అక్రమ్.. తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే పోలీసులు ఇతడిపై నిరంతరం నిఘాను పెట్టారు. అలాగే వీరు దాడి చేసేందుకు ఉపయోగించిన తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలోనే అవన్నీ చట్టబద్ధంగా లైసెన్స్ పొందినవి తెలిసింది. ముఖ్యంగా ఇవన్నీ సాజిద్ అక్రమ్ పేరు మీదే ఉండగా.. దాడిలో వీటన్నింటినీ వినియోగించారు.


న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్ ఈ దాడిని రాత్రి 9.36 గంటలకు ఉగ్రవాద ఘటనగా ప్రకటించారు. దీని ఫలితంగా ఫెడరల్, రాష్ట్ర పోలీసులు సంయుక్త ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు అంతా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ దీనిని "నిజమైన దుర్మార్గపు చర్య"గా అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిని "పూర్తిగా సెమిటిక్ వ్యతిరేక దాడి"గా పేర్కొన్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. దాడికి ముందు ఆస్ట్రేలియా ప్రభుత్వం తగినంత కఠినంగా వ్యవహరించలేదని విమర్శించారు. అందువల్లే ఉగ్రవాదులు దాడి చేశారని, ముఖ్యంగా లైసెన్స్డ్ తుపాకులు పొందారని పేర్కొన్నారు.


Latest News
GOBARDHAN scheme powers Gujarat's march towards clean, self-reliant villages Thu, Dec 18, 2025, 03:12 PM
Congress holds state‑wide protests in Telangana over National Herald case Thu, Dec 18, 2025, 03:05 PM
Fresh clashes erupt between Afghanistan and Pakistan in Kunar Thu, Dec 18, 2025, 03:03 PM
202 Indians recruited into Russian Army; 26 dead, 50 awaiting discharge: Centre in RS Thu, Dec 18, 2025, 03:00 PM
Ashes: Cummins, Lyon lead Australia's dominance on Day 2 of Adelaide Test Thu, Dec 18, 2025, 02:55 PM