|
|
by Suryaa Desk | Mon, Dec 15, 2025, 03:09 PM
పేద వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. దీన్ని అడ్డుకునేందుకు జగన్ దొంగ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. సోమవారం అనకాపల్లిలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో.. ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైద్య కళాశాలల అంశంపై జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు.
Latest News