|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 04:35 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్రంగా విమర్శించారు. ఆదివారం తన నియోజకవర్గంలో పర్యటించిన ఆమె, పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.పర్యటనలో భాగంగా కక్కలపల్లి గ్రామ చెరువుకు గ్రామస్తులతో కలిసి జలహారతి ఇచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు పాలనలోనే రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు సైతం నీరు అందుతోందని అన్నారు. ఆయన కృషితోనే చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయని, దీంతో రైతులు, గ్రామ ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలిపారు.గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం వెనుకబడిపోయిందని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో పయనిస్తోందని, ఆయన పాలనతోనే గ్రామాలు సస్యశ్యామలం అవుతున్నాయని పరిటాల సునీత పేర్కొన్నారు.
Latest News