లిబియాలో కిడ్నాప్‌కు గురైన భారతీయ కుటుంబం
 

by Suryaa Desk | Sun, Dec 14, 2025, 04:22 PM

అక్రమంగా విదేశాలకు వలస వెళ్లే ప్రయత్నంలో గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబం లిబియాలో కిడ్నాప్‌కు గురైంది. దంపతులతో పాటు వారి మూడేళ్ల కుమార్తెను కూడా బంధించిన దుండగులు, వారిని విడిచిపెట్టాలంటే రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివరాలను అధికారులు వెల్లడించారు.మెహసానా జిల్లాలోని బాదల్‌పురా గ్రామానికి చెందిన కిస్మత్‌సిన్హ్ చావ్డా, ఆయన భార్య హీనాబెన్, కుమార్తె దేవాన్షీ.. పోర్చుగల్‌లో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కిస్మత్‌సిన్హ్ సోదరుడు అక్కడే ఉంటుండటంతో, ఓ పోర్చుగల్ ఏజెంట్ సహాయంతో వారు ప్రయాణం ప్రారంభించారు. ఈ విషయాన్ని మెహసానా ఎస్పీ హిమాన్షు సోలంకి తెలిపారు.పోలీసుల కథనం ప్రకారం ఈ కుటుంబం నవంబర్ 29న అహ్మదాబాద్ నుంచి దుబాయ్ వెళ్లింది. అక్కడి నుంచి వారిని లిబియాలోని బెంఘాజీ నగరానికి తరలించగా, అక్కడే వారు కిడ్నాప్‌కు గురయ్యారు. అనంతరం కిడ్నాపర్లు మెహసానాలోని వారి బంధువులను సంప్రదించి రూ. 2 కోట్లు డిమాండ్ చేశారు. ఈ కేసులో ప్రమేయమున్న ఏజెంట్లు భారతీయులు కాదని పోలీసులు స్పష్టం చేశారు.బాధితుల బంధువులు శుక్రవారం తమను సంప్రదించారని మెహసానా కలెక్టర్ ఎస్.కె. ప్రజాపతి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సీజే చావ్డా కూడా ఈ అంశాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియజేసి, వారిని సురక్షితంగా విడిపించేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు.

Latest News
Parody song row puts CPI(M) on defensive in Kerala, sparks double standards debate Wed, Dec 17, 2025, 12:22 PM
Woman preparing for competitive exams dies by suicide in Karnataka's Dharwad Wed, Dec 17, 2025, 12:12 PM
Karnataka BJP warns of protest over Gruha Laxmi dues issue; seeks apology from minister Wed, Dec 17, 2025, 12:10 PM
Luthra brothers brought to Goa a day after deportation from Thailand Wed, Dec 17, 2025, 12:09 PM
Sensex, Nifty trade flat in early deals amid weak global cues Wed, Dec 17, 2025, 12:00 PM