పోలవరం-నల్లమలసాగర్‌ లింక్‌ ప్రాజెక్టును నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ
 

by Suryaa Desk | Sun, Dec 14, 2025, 04:19 PM

ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్‌ లింక్‌ ప్రాజెక్టును తక్షణమే అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లకుండా కేంద్ర జల సంఘం సహా ఇతర సంస్థలను నియంత్రించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కేంద్ర జలశక్తి కార్యదర్శి వి.ఎల్.కాంతారావుకు లేఖ రాశారు.పాత పోలవరం-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టుకే పేరు మార్చి, డీపీఆర్ కోసం ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలిచిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. వరద నీటిపై ఆధారపడిన ఈ ప్రాజెక్టుపై తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయని గుర్తుచేశారు. ఈ అంశంపై రేపు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి ప్రతిగా తమ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని ఏపీ ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది.

Latest News
IPL 2026: 'So excited to get down to Eden,' says Cam Green after being roped in by KKR Tue, Dec 16, 2025, 05:04 PM
Over 3000 Afghan refugees forcibly deported from Iran, Pakistan in single day Tue, Dec 16, 2025, 05:01 PM
GST rate revision has resulted in 5 per cent rise in revenue for states: Minister Tue, Dec 16, 2025, 04:59 PM
BJP Working President Nitin Nabin resigns from Bihar cabinet Tue, Dec 16, 2025, 04:59 PM
India's textiles exports see 4.6 pc growth in last 4 fiscals, exports rise in over 100 nations Tue, Dec 16, 2025, 04:35 PM