18 నెలల్లో రూ.2,66,175 కోట్ల అప్పులా చంద్రబాబు?
 

by Suryaa Desk | Sun, Dec 14, 2025, 01:26 PM

ఆరోగ్యంగా ఉన్న ఆంధ్రరాష్ట్రం ఈ 18 నెలల కాలంలో అప్పులాంధ్రప్రదేశ్‌ గా మిగిలిపోతోందని, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 18 నెలల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏకంగా రూ.2,66,175 కోట్ల అప్పు చేసిందని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన రుణంలో, దాదాపు 80 శాతం కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే చేసిందని ఆయన గుర్తు చేశారు. అయితే అప్పుడు రెండేళ్లు కోవిడ్‌ సంక్షోభం ఉన్న విషయాన్ని మర్చిపోవద్దని అన్నారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వం అప్పు చేసినా, ఏ ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకాన్ని, కార్యక్రమాన్ని ఆపలేదని, దాదాపు రూ.2.70 లక్షల కోట్లు డీబీటీ రూపంలో వివిధ పథకాల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిందని చెప్పారు. ఇప్పుడు ఇంతింతగా అప్పు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, ఆ మొత్తం ఎక్కడ ఖర్చు చేస్తున్నారో చెప్పమంటే నోరు మెదపడం లేదని, విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు.

Latest News
India's staffing industry surges 5 pc in Q2 FY26 sequentially Wed, Dec 17, 2025, 01:51 PM
Congress MPs protest against Centre on Parliament premises over National Herald case Wed, Dec 17, 2025, 01:46 PM
Searches in J&K's Mansar after villagers report suspicious movement Wed, Dec 17, 2025, 01:15 PM
India aims for a 1.28-crore job expansion in 2026 Wed, Dec 17, 2025, 12:55 PM
Kerala Police officer suspended for alleged sexual assault on woman colleague Wed, Dec 17, 2025, 12:52 PM