|
|
by Suryaa Desk | Sun, Dec 14, 2025, 01:25 PM
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిందని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇది ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. లక్ష్యానికి మించి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగింది. గ్రామాలు, వార్డుల్లో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజల మద్దతు కూడగట్టాం. ఇప్పటికే సంతకాలు చేసిన పత్రాలను నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు తరలించారు. ఈ మహాయజ్జంలో పాల్గొన్న వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలను జగన్ గారు ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు. శనివారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు & అధికారిక ప్రతినిధులు, జిల్లా అనుబంధ విభాగ అధ్యక్షులు, అసెంబ్లీ అనుబంధ విభాగ అధ్యక్షులు. జనరల్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Latest News