భారీగా దిగొస్తున్న చమురు ధరలు.. హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా
 

by Suryaa Desk | Sat, Dec 13, 2025, 10:49 PM

చమురు ధరలు అంతర్జాతీయంగా కొంత కాలంగా దిగొస్తున్నాయి. దీనికి ఎన్నో అంశాలు దోహదం చేస్తున్నాయి. చమురు సరఫరా అంచనాలు పెరిగిపోతుండటంతో యూఎస్ క్రూడ్ ఆయిల్ ధరలు మే నెల తర్వాత చూస్తే.. అత్యంత కనిష్ఠ స్థాయిలకు పడిపోయాయి. 2026లో చమురు సరఫరా (క్రూడ్ సప్లై) డిమాండ్‌ను మించుతుందన్న అంచనాలు మార్కెట్లో బలపడుతున్నాయి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ కూడా చమురు మిగులు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తపరిచింది. ప్రపంచ చమురు నిల్వలు నాలుగు సంవత్సరాల గరిష్ఠానికి చేరుకున్నట్లు తెలిపింది.


ఇదే క్రమంలో అమెరికన్ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు పెరగడంతో.. చమురు మార్కెట్లోని ఒత్తిడిని మరింత పెంచింది. డీజిల్ ఫ్యూచర్స్ చూస్తే దాదాపు 1.4 శాతం తగ్గాయి. ఇది కూడా చమురు ధరల పతనానికి దారితీసింది. క్రిస్మస్, నూతన సంవత్సరం సెలవుల ముందు ట్రేడింగ్ కార్యకలాపాలు తగ్గడం కూడా దీనికి కారణంగా నిలిచింది. యూఎస్ క్రూడ్ బ్యారెల్‌కు 58 డాలర్ల కంటే దిగువకు చేరింది. ఇది మే నెల తర్వాత కనిష్ఠ స్థాయి కావడం విశేషం. బ్రెంట్ క్రూడ్ దాదాపు 2 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది.


>> పలు కారణాల వల్ల ధరలు పడిపోతున్నప్పటికీ.. కొన్ని భౌగోళిక, రాజకీయ సంఘటనలు చమురు ధరలకు కాస్త మద్దతు ఇస్తున్నాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో.. రష్యాపై పలు దేశాలు కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఈ ఆంక్షలు తొలగించేందుకు వీలు కల్పించేలా శాంతి ఒప్పందం విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. చర్చలు ఒకవైపు జరుగుతున్నా ఉక్రెయిన్.. రష్యా చమురు ఆస్తుల్ని టార్గెట్‌గా చేసుకుంటూనే ఉంది. ఈ క్రమంలోనే చమురు ధరలు కనిష్టాలకు పడిపోతున్నాయి.


అయితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడుతున్నప్పటికీ.. దేశీయంగా మాత్రం రేట్లు స్థిరంగానే కొనసాగుతున్నాయి. చాలా కాలం తర్వాత.. గతేడాది పార్లమెంట్ ఎన్నికల సమయంలో లీటర్‌ పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం రూ. 2 చొప్పున తగ్గించింది. మళ్లీ రేట్లను తగ్గించింది లేనే లేదు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.41 గా ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ. 95.65 గా ఉంది. ప్రధాన మెట్రో నగరాల్లో చూస్తే దేశీయంగా ఎక్కువ ధరలు ఉన్న సిటీల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంటుందని చెప్పొచ్చు.

Latest News
41 Maoists, including 39 from Chhattisgarh, surrender before Telangana Police Fri, Dec 19, 2025, 04:56 PM
India-Oman free trade pact likely to become operational within 3 months: Piyush Goyal Fri, Dec 19, 2025, 04:55 PM
Hanwha Ocean wins $1.75 billion order for 7 LNG carriers from Europe Fri, Dec 19, 2025, 04:49 PM
EAM Jaishankar and Netherlands counterpart discuss bilateral ties, global issues Fri, Dec 19, 2025, 04:46 PM
Odds are slim, fight until last ball: Hussain says England 'need miracle' to keep Ashes hopes alive Fri, Dec 19, 2025, 04:38 PM