|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 11:13 PM
రోజు ఉదయం లేవగానే ఈ రోజు ఏం బ్రేక్‌ఫాస్ట్ చేయాలనే ఆలోచనే చాలా మందికి ముందుగా వస్తుంది. బ్రేక్‌ఫాస్ట్ అనేది రోజులో ముఖ్యభాగం. హెల్దీగా చేస్తే చాలా వరకూ రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. అంతేకానీ, ఈజీగా లభించే బయటి నుంచి కొనుక్కొచ్చే బ్రేక్‌ఫాస్ట్ కాకుండా ముందురోజు కొన్ని ప్రిపేర్ చేసుకుంటే హెల్దీగా బ్యాలెన్స్డ్ బ్రేక్‌ఫాస్ట్ చేసినవారవుతాం. అలాంటి ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్, విటమిన్స్, కాంప్లెక్స్ కార్బ్స్ అన్నీ కలిసి బ్యాలెన్స్డ్ బ్రేక్‌ఫాస్ట్ గురించి న్యూట్రిషనిస్ట్ సాహితీ సజెస్ట్ చేస్తున్నారు. వారంలో 7 రోజుల్లో ఏం తింటే ఆప్షన్స్ కూడా సూచిస్తున్నారు. అవి మీకోసం.
మొదటి రోజు బ్రేక్‌ఫాస్ట్ కోసం
ఉడికించిన చిలగడదుంప ఒకటి.
నల్ల శనగలు, పనీర్, కార్న్ సలాడ్
కప్పు బొప్పాయి ముక్కలు
నానబెట్టిన బాదం, ఖర్జూరం ముక్కలు.
ఈ ప్లేట్‌లో మీకు అన్నీ లభిస్తాయి. హెల్దీగా తినొచ్చు.
రెండోరోజు బ్రేక్‌ఫాస్ట్ కోసం
ఓట్స్‌ని చియా సీడ్స్‌తో కలిపి తీసుకోవచ్చు.
వీటితో పాటు శనగలు, కార్న్ సలాడ్
ఓ ఆపిల్
ఇందులో కూడా మనకి ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది.
మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్‌లో
ఓ దోశ, పల్లీచట్నీ
ఉడికించిన కోడిగుడ్లు రెండు వైట్స్ తీసుకోవాలి.
బాదం, ఖర్జూరాలు తీసుకోవచ్చు.
ఇవన్నీ ఈజీగా తయారుచేసుకోవచ్చు.
నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ కోసం
పోహా, ఉడికించిన చిలగడదుంప
రెండు కోడిగుడ్లు, ఆరెంజ్
ఈ ప్లేట్‌ని ఇలానే తీసుకుంటే మనకి 430 కేలరీలతో పాటు 14 గ్రాముల వరకూ ప్రోటీన్ అందుతుంది. ఇది చాలా మంచిది.
ఐదో రోజు కోసం ఏబీసిడి బ్రేక్‌ఫాస్ట్
ఆపిల్ ఒకటి
బీట్‌రూట్, క్యారెట్ సూప్
శనగల సలాడ్
రెండు డేట్స్
హెల్దీ బ్యాలెన్స్‌డ్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్
ఆరోరోజు బ్రేక్‌ఫాస్ట్ కోసం
రాగి ఉప్మా, టమాట చట్నీ
ఉడికించిన 2 ఎగ్స్ వైట్స్
ఆపిల్, గుమ్మడిగింజలు
ఇందులో కూడా చక్కగా ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ అన్నీ అందుతాయి. చక్కగా హాయిగా తినొచ్చు.
ఏడో రోజు బ్రేక్‌ఫాస్ట్ కోసం
రాగి ఇడ్లీ, పల్లీ చట్నీ
రెండు ఉడికించిన గుడ్లు
నానబెట్టిన బాదం 2, వాల్‌నట్ ఒకటి
ఇలా తీసుకోవడం వల్ల బ్యాలెన్స్డ్ బ్రేక్‌ఫాస్ట్ చేసినట్లుగా ఉంటుంది.
Latest News