|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 12:27 PM
చిత్తూరు జిల్లా నగరి మండలం తడుకుపేట వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. తిరుచానూరు నుంచి తిరుత్తణి వైపు వెళ్తున్న కారు, చెన్నై నుంచి తిరుమల వైపు వస్తున్న మరో కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో తిరుచానూరుకు చెందిన శంకర్, సంతానం, చెన్నైకి చెందిన అరుణ్ ఉన్నారు. తమిళనాడుకు చెందిన మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతదేహాలను నగరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.
Latest News