|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 11:08 PM
దంతక్షయం చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది. ప్రధానంగా నోటి శుభ్రత పాటించకపోవడం. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల దంత సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్య పళ్ళ మీద బాక్టీరియా ఏర్పడడం వల్ల వస్తుంది. ఈ బాక్టీరియా ప్లేక్ అనే ఒక పొరని తయారు చేస్తుంది. ఈ పొర పంటి మీద ఎనామిల్ లోంచి మినరల్స్ ని తీసేస్తుంది. పళ్లు బలంగా ఉండడానికి కావాల్సిన కాల్షియం, ఫాస్ఫేట్ ఈ ఎనామిల్‌లోనే ఉంటాయి. దీని వల్ల ఎనామిల్‌లో రంధ్రాలు ఏర్పడుతాయి. అది నెమ్మదిగా దంత క్షయానికి దారి తీస్తుంది.
కొంతమంది పళ్ల మీద నల్లటి మచ్చలు కనిపించినా వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. త్వరగా డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా, అది ఇన్ఫెక్షన్‌కు దారి తీసే వరకు ఉంటారు. ఇలా లేట్ చేస్తే రూట్ కెనాల్ చేయించుకోవాలని, ఇంకా ముదిరితే పంటిని తీసేయాల్సి వస్తుందని డాక్టర్ పూనమ్ అన్నారు. ఆమె యూట్యూబ్ ఛానల్ స్మైల్ ఓపెన్లీ యూట్యూబ్ ఛానల్‌లో దంతక్షయం ఎలా ట్రీట్ చేస్తారు, దాన్ని ఎలా క్లీన్ చేస్తారో మనకు వివరించారు.
డెంటల్ ఫిల్లింగ్
పన్ను పుచ్చుతూ ఉంటే, చాలామంది మొదట చేసే పొరపాటు ఇంకా కొద్ది రోజులు చూద్దాం అని వాయిదా వేస్తూ ఉంటారు. కానీ దంతక్షయం తగ్గిపోదు. రోజురోజకు లోపలికి మరింతగా వ్యాపిస్తూ ఉంటుంది. చివరకు నరాల వద్దకు చేరుతుంది. ఈ సమస్యను తొలి దశలోనే ఆపడానికి ఎఫెక్టివ్ మార్గం డెంటర్ ఫిల్లింగ్.
డెంటర్ ఫిల్లింగ్ అంటే ఏమిటి?
డెంటల్ ఫిల్లింగ్‌లో పుచ్చిన పంటిలో ఉన్న చెడు భాగాన్ని తీసేస్తారు. ఆ రంధ్రాన్ని ప్రత్యేకమైన ఫిల్లింగ్ మెటీరియల్‌తో నింపుతారు. దీంతో దంతక్షయం ఆగిపోతుంది. రంధ్రం మూసుకుపోయి పన్ను తిరిగి గట్టిగా అవుతుంది. నొప్పి, ఇన్ఫెక్షన్ ఉండువు.
ఫిల్లింగ్ ఎలా చేస్తారు?
ఫిల్లింగ్ చేయడానికి డెంటల్ డాక్టర్ ముందుగా పుచ్చిన ప్రాంతాన్ని పూర్తిగా పరీక్షిస్తారు. అవసరమైతే ఎక్స్-రే తీసి లోపలి వరకు చెక్ చేస్తారు. పుచ్చిన ప్రాంతాన్ని క్లీన్ చేసి దాన్ని తొలగిస్తారు. శుభ్రం చేసిన రంధ్రాన్ని ఫిల్లింగ్ పదార్థంతో నింపుతారు. పన్నుతో సమానంగా ఉండేలా పొరను సర్దుతారు, దీంతో పన్ను సహజంగా కనిపించేలా చేస్తారు. ఈ ప్రాసెస్‌లో నొప్పి ఉండదు. ఫిల్లింగ్ చేసిన రోజు నుంచే సాధారణ ఆహారం తినవచ్చు.
ఫిల్లింగ్‌కు ఏమి వాడతారు?
ఫిల్లింగ్‌కు పరిస్థితిని బట్టి డాక్టర్స్ సరైన పదార్థాన్ని ఎంచుకుంటారు.
కాంపోజిట్ - ఇది పళ్ల రంగులో ఉంటుంది, పళ్లు అందంగా కనిపిస్తాయి.
సిల్వర్ ఫిల్లింగ్ - ఈ ఫిల్లింగ్ స్ట్రాంగ్‌గా ఉంటుంది.
సెరామిక్ / గ్లాస్ అయ్యోనోమర్ - పిల్లలకు, సెన్సిటివిటీ ఎక్కువ ఉన్నవారికి ఇది సహాయపడుతుంది.
Latest News