25 లక్షల హోం లోన్‌పై,,,,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపు
 

by Suryaa Desk | Mon, Dec 08, 2025, 10:58 PM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల కీలక రెపో రేట్లను తగ్గించింది. మరోసారి 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించగా.. ప్రస్తుతం కీలక వడ్డీ రేట్లు 5.25 శాతానికి చేరాయి. ఈ ఏడాది ప్రారంభంలో 6.50 శాతంగా ఉండగా.. వరుసగా తగ్గిస్తూ వచ్చింది. ఫిబ్రవరిలో 25 బేసిస్ పాయింట్లు తగ్గించగా.. మళ్లీ ఏప్రిల్‌లో 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. తర్వాత జూన్ నెలలో 50 బేసిస్ పాయింట్ల కోత విధించింది. ఇప్పుడు డిసెంబర్ 5న మరోసారి 25 బేసిస్ పాయింట్ల కోత విధించింది. ఇలా మొత్తంగా 10 నెలల వ్యవధిలో 125 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ క్రమంలోనే 6.50 శాతం నుంచి 5.25 శాతానికి దిగొచ్చింది. ఈ క్రమంలోనే రెపో ఆధారిత రుణ రేట్లను బ్యాంకులు తగ్గిస్తున్నాయి.


>> ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా రుణ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించగా.. ఆర్బీఐ బాటలోనే ఇతర ప్రముఖ బ్యాంకులైన ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా రుణ రేట్లు తగ్గించాయి. ఇప్పుడు మరో ప్రముఖ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ కూడా రుణ రేట్లు తగ్గించేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు.. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను 


అంటే ఎంసీఎల్ఆర్‌కు లింక్ అయి ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లోన్ వడ్డీ రేట్లు తగ్గుతాయన్నమాట. లోన్ టెన్యూర్లను బట్టి 5 బేసిస్ పాయింట్ల వరకు తగ్గుముఖం పట్టింది. అంతకుముందు నవంబర్ నెలలోనూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు లోన్ వడ్డీ రేట్లను తగ్గించేసింది. ఇప్పుడు ఈ బ్యాంకులో అంతకుముందు ఎంసీఎల్ఆర్ రేంజ్ 8.35- 8.60 శాతంగా ఉండగా.. ఇప్పుడు 8.30 శాతం నుంచి 8.55 శాతానికి దిగొచ్చాయి.


ఈ బ్యాంకులో హోం లోన్ రేట్ల విషయానికి వస్తే.. ఆర్బీఐ పాలసీ రేటుకు అదనంగా 2.40- 7.70 శాతం వరకు ఉంటాయి. అంతకుముందు ఇది 7.90-13.20 శాతంగా ఉండగా.. ఆర్బీఐ పాలసీ రేటు 5.25 శాతానికి తగ్గడంతో బ్యాంకులో హోం లోన్ వడ్డీ రేట్లు 7.65- 12.95 శాతానికి చేరనున్నాయి. సిబిల్ స్కోరు మెరుగ్గా ఉంటే.. తక్కువ అంటే కనీస వడ్డీ రేటుకే లోన్ లభిస్తుంది. కనీసం 8 శాతానికి హోం లోన్ లభించినా.. హెచ్‌డీఎ‌ఫ్‌సీ బ్యాంకులో రూ. 25 లక్షల లోన్‌పై ఈఎంఐ ఎంత పడుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


>> రూ. 25 లక్షల హోం లోన్‌.. కనీసం 8 శాతం వడ్డీ రేటుతో.. 10 సంవత్సరాల టెన్యూర్‌తో తీసుకున్నామనుకుంటే.. అప్పుడు నెలకు ఈఎంఐ రూ. 30,332 చొప్పున పడుతుంది. ఇక్కడ టెన్యూర్ మొత్తానికి చూస్తే వడ్డీ రూ. 11.39 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా రూ. 36 లక్షలు కట్టాలి. అదే టెన్యూర్ 15 ఏళ్లు పెట్టుకుంటే ఇక్కడ ఈఎంఐ రూ. 23,891 గా ఉంది. ఇక్కడ వడ్డీతోనే రూ. 18 లక్షలు కట్టాలి. 20 ఏళ్లకు అయితే నెలకు రూ. 20 వేలు ఈఎంఐగా ఉంది. మొత్తం వడ్డీ రూ. 25 లక్షలకుపైన పడుతుంది.

Latest News
India to outpace global average with 2026 medical trend at 11.5 pc: Report Thu, Dec 11, 2025, 01:05 PM
NZ hold the edge despite Windies' fightback on Day 2 of Wellington Test Thu, Dec 11, 2025, 01:01 PM
India's GCC sector to reach $105 billion by 2030 driven by policy initiatives Thu, Dec 11, 2025, 12:58 PM
US Federal Reserve cuts interest rate by 0.25% Thu, Dec 11, 2025, 12:55 PM
Gujarat declares 11 more developing talukas; each to get Rs 3 crore annual grant Thu, Dec 11, 2025, 12:51 PM