|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 10:24 PM
చాలా మంది గుండె సమస్యల కారణంగా అకస్మాత్తుగా మృతి చెందుతున్నారు. పరిశోధనల్లో ఈ మరణాల వెనుక అనేక కారణాలు గుర్తించబడ్డాయి. హార్ట్ ఎటాక్ కారణంగా మరణించే వారి వయసు పరిమితి లేదు. ఆరోగ్యవంతులైనా కొందరు సడన్‌గా హార్ట్ ఎటాక్‌కు గురవుతున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, బాత్ రూమ్‌లో హార్ట్ ఎటాక్‌తో మరణాల సంఖ్య పెరుగుతోంది. వైద్య నిపుణుల ప్రకారం, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చని సూచిస్తున్నారు.బాత్ రూమ్‌లో హార్ట్ ఎటాక్ ఎక్కువగా సంభవించే ప్రధాన కారణాల్లో ఒకటి, మలమూత్ర విసర్జన సమయంలో శరీరంపై వచ్చే ఒత్తిడి. మలమూత్ర విసర్జన సమయంలో కొందరు ఎక్కువ ఒత్తిడితో ప్రయత్నిస్తారు. చాలా సేపు మూత్రాన్ని పట్టుకుని, ఆ తర్వాత వెనికి దెబ్బతీయడం గుండె వేగాన్ని పెంచుతుంది. ఇది హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉన్న పరిస్థితిని కలిగిస్తుంది.మరొక కారణం, స్నానం చేసే విధానం. చాలా చల్లగా లేదా ఎక్కువగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయడం మంచిది కాదు. శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా వచ్చిన మార్పులు గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి. అలాగే, బెడ్ నుంచి లేచి వెంటనే హడావిడి లో బాత్ రూమ్‌కు వెళ్లడం కూడా ఒత్తిడిని పెంచి హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తుంది.వైద్యుల సూచనల ప్రకారం, బాత్ రూమ్‌లో మలమూత్ర విసర్జన సమయంలో ఎక్కువ ఒత్తిడి చేయకూడదు. మూత్రం లేదా మలాన్ని ఎక్కువ సేపు నిరోధించకూడదు. స్నానంలో, ముందుగా నీటిని పాదాలపై వేసి, తర్వాత తలపై పోసుకోవడం మంచిది. ఈ జాగ్రత్తలు పాటిస్తే బాత్ రూమ్‌లో హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
Latest News