|
|
by Suryaa Desk | Mon, Dec 08, 2025, 09:44 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్— చిరంజీవి కుమారుడిగా ఎంట్రీ ఇచ్చినా, తన సొంత ప్రతిభతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా నిలిచాడు. ప్రస్తుతం ఆయన తీసుకుంటున్న సినిమా ఎంపికల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు సానిధ్యం లో తెరకెక్కుతున్న "పెద్ది" సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతో మరోసారి తన మార్కెట్‌ను నిలబెట్టుకోవాలని, తన సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే ఇటీవల ఆయన కెరీర్‌లో కొంత వెనకబడినట్టుగా సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.ఆచార్య సినిమాలో చేసిన గెస్ట్ అప్పియరెన్స్ ఆయనకు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అలాగే ఎంతో హైప్‌తో వచ్చిన "గేమ్ చేంజర్" కూడా అతనికి పెద్ద విజయాన్ని అందించలేదు. అందుకే ఈ పెద్ది సినిమా రామ్ చరణ్‌కు చాలా కీలక ప్రాజెక్ట్‌గా మారింది.ఈ సినిమా షూటింగ్ ఇప్పటి వరకు సుమారు 80% పూర్తైందని సమాచారం. ప్రస్తుతం అవుట్‌డోర్ షూట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ షూటింగ్ కోసం మరో రాష్ట్రానికి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆయన ప్రయాణించాల్సిన ఇండిగో ఫ్లైట్ పైలట్ కొరత కారణంగా తాత్కాలికంగా రద్దు కావడంతో, ఆయన షూట్‌కు హాజరు కాలేకపోయాడు. దీనివల్ల ఆ రోజు షూటింగ్ కూడా రద్దయింది. పలువురు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ పరిస్థితిలో రామ్ చరణ్ కూడా ఒకరిగా మారడం ప్రత్యేకం.ఇక ఈ షెడ్యూల్‌కు సంబంధించిన తదుపరి షూట్ ఎప్పుడుండబోతుందనే విషయంపై స్పష్టత వచ్చేలా బృందం ఎదురుచూస్తోంది. మరోవైపు, దర్శకుడు బుచ్చిబాబు వచ్చే రెండు నెలల్లో సినిమా మొత్తం పూర్తి చేసి, మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ప్రయత్నాల్లో ఉన్నాడు.బుచ్చిబాబు భావించినట్టుగా ఈ సినిమా రామ్ చరణ్‌కు బీజేపి రేంజ్ సక్సెస్ ఇస్తుందా? అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా? అన్నది చూడాల్సి ఉంది.
Latest News