|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 09:54 PM
నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతికి పోలీసులు మరోసారి షాక్ ఇచ్చారు. పుదుచ్చెరిలో మంగళవారం (డిసెంబర్ 9) జరగనున్న రాజకీయ సభకు పోలీసులు ఆంక్షలు విధించారు.సెప్టెంబర్ 27న కరూరులో జరిగిన సభలో ఘర్షణలు చోటు చేసుకోవడంతో, పోలీసులు ఈసారి కఠిన మార్గదర్శకాలను జారీ చేశారు. ఉప్పాలలోని న్యూ పోర్ట్ ఎక్స్‌పో గ్రౌండ్లో జరగనున్న సభకు పుదుచ్చెరిలో నివాసం ఉన్న ప్రజలకు మాత్రమే ప్రవేశానుమతి ఇచ్చారు. తమిళనాడులోని ఎవరు వచ్చినా ప్రవేశం కుదరదని పోలీసులు స్పష్టం చేశారు.సభను ఉదయం 12:30 గంటలలోపు ముగించాల్సిన ఆదేశాలను పోలీసులు విడుదల చేశారు. సభలో కేవలం 5,000 మందికి మాత్రమే అనుమతి ఉంది. TVK పార్టీ ద్వారా జారీ చేసిన QR కోడ్ పాస్ ఉన్నవారికి మాత్రమే వేదికలో ప్రవేశం కల్పిస్తారు. పాస్ లేని వారు ప్రవేశించలేరు. ప్రజలను నియంత్రించడానికి 500 మంది సామర్థ్యంతో వేర్వేరు ఎన్-క్లోజర్లు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. అలాగే, పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు సభలో ప్రవేశించరాదు. కరూర్ ఘటన మళ్లీ పునరావృతం కాకుండా చూడడం ప్రధాన లక్ష్యమని పోలీసులు తెలిపారు.సభ ప్రాంగణంలో తాగునీరు, మరుగుదొడ్లు, అంబులెన్సులు, మెడికల్ టీమ్‌లు, ఫైర్ ఇంజిన్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు వంటి అన్ని భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు. పార్కింగ్ కోసం పొండి మారినా, స్టేడియం వెనుక ప్రాంతం, ఓల్డ్ పోర్ట్ ఏరియా అనే మూడు ప్రాంతాలను మాత్రమే కేటాయించారు. TVK కార్యకర్తలు రోడ్లపై వాహనాలను నిలుపుకోవడం పూర్తిగా నిషేధించబడింది.
Latest News