|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 04:28 PM
దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో నెలకొన్న తీవ్ర అంతరాయాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తీవ్రంగా స్పందించింది. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంస్థ యాజమాన్యాన్నే బాధ్యులను చేస్తూ.. ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.ఈరోజు కూడా పలు ఇండిగో విమానాలు రద్దు కావడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఈ నేపథ్యంలో డీజీసీఏ రంగంలోకి దిగింది. సంస్థ ప్రణాళిక, పర్యవేక్షణ, వనరుల నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని నోటీసులో పేర్కొంది. పైలట్ల ఫెటీగ్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన నిబంధనలను పాటించడంలో ఇండిగో విఫలమైందని స్పష్టం చేసింది. "సంస్థ సీఈవోగా నమ్మకమైన కార్యకలాపాలు నిర్వహించడంలో, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో మీరు విఫలమయ్యారు" అని డీజీసీఏ ఆ నోటీసులో తీవ్రంగా వ్యాఖ్యానించింది.
Latest News