|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 04:20 PM
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. వన్డే సిరీస్ విజయం అనంతరం ఘాటుగా స్పందించాడు. విశాఖపట్నంలో శనివారం జరిగిన చివరి వన్డేలో 9 వికెట్ల తేడాతో గెలిచి, 2-1తో సిరీస్ కైవసం చేసుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడాడు. విభజన కోచింగ్ విధానం ఉండాలంటూ వ్యాఖ్యానించిన ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని పార్థ్ జిందాల్‌ను ఉద్దేశించి గంభీర్ పరోక్షంగా విమర్శలు గుప్పించాడు."టెస్టు సిరీస్ ఓటమికి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడటమే కారణమని ఎవరూ మాట్లాడలేదు. పిచ్ గురించే అందరూ చర్చించారు. క్రికెట్‌తో సంబంధం లేని వారు కూడా అభిప్రాయాలు చెప్పారు. ఓ ఐపీఎల్ జట్టు యజమాని అయితే విభజన కోచింగ్ గురించి రాశారు. ఎవరి పని వారు చూసుకుంటే మంచిది. నేను ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోనప్పుడు, నా విషయంలోకి రావడానికి వారికి హక్కు లేదు" అని గంభీర్ అన్నాడు.
Latest News