|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 04:06 PM
తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణిలో చోరీ కేసు నిందితుడు రవికుమార్ తాను పెద్ద తప్పు చేశానంటూ వెక్కివెక్కి ఏడుస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. 2023 ఏప్రిల్ 29న పరకామణిలో తాను మహాపాపం చేశానని, ఆ తప్పును తలుచుకుని తానూ, తన భార్యాపిల్లలు బాధపడని రోజు లేదని రవికుమార్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్, స్థిరాస్తి వ్యాపారాలు చేసిన తాను, ప్రాయశ్చిత్తంగా తన ఆస్తిలో 90 శాతాన్ని శ్రీవారికి రాసిచ్చానని కన్నీటితో తెలిపారు. ఏడాదిగా అజ్ఞాతంలో ఉన్న రవికుమార్, ఇటీవల హైకోర్టు ఆదేశాలతో సీఐడీ విచారణకు హాజరైన తర్వాత ఈ వీడియోను విడుదల చేశారు.కొందరు తనను బెదిరించి ఆస్తులు రాయించుకున్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రవికుమార్ స్పష్టం చేశారు. అయితే, కొందరు తనను బ్లాక్‌మెయిల్ చేసిన మాట వాస్తవమేనని, వారిపై కేసులు కూడా పెట్టానని తెలిపారు. తన ప్రైవేటు భాగాల్లో శస్త్రచికిత్సలు చేయించుకుని నగదు దాచినట్లు మూడేళ్లుగా జరుగుతున్న అసభ్య ప్రచారంతో తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురవుతోందని వాపోయారు.
Latest News