|
|
by Suryaa Desk | Sun, Dec 07, 2025, 12:38 PM
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆదివారం విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి (సింహాద్రి అప్పన్న) ఆలయాన్ని దర్శించుకున్నారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డేలో విజయం సాధించిన సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకున్నట్లు సమాచారం. ఆలయ అధికారులు కోహ్లీకి ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శన అనంతరం, కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.
Latest News