|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 11:55 AM
భారతరత్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమాలు శనివారం గుడివాడ పట్టణంలో ఘనంగా జరిగాయి. గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమాల్లో గుడివాడ, పామర్రు, పెడన ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణ ప్రసాద్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించి, జోహార్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు.
Latest News