|
|
by Suryaa Desk | Sat, Dec 06, 2025, 11:50 AM
అమెరికా తమ దేశంలోకి అడుగు పెట్టకుండా మరికొన్ని దేశాల పౌరులపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. అమెరికా పౌరుల భద్రత పేరుతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది. ఇప్పటికే 19 దేశాలకు చెందిన పౌరులపై నిషేధం అమలులో ఉండగా, తాజాగా మరో 11 దేశాలు ఈ జాబితాలో చేరనున్నట్లు తెలుస్తోంది. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికా పౌరుల భద్రత పెరుగుతుందని, నేరాలు తగ్గుతాయని ఆమె పేర్కొన్నారు.
Latest News