|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 04:10 PM
తన తల్లిదండ్రులు, ముఖ్యంగా తండ్రి చంద్రబాబు, పేరెంట్ టీచర్ మీటింగ్‌లకు హాజరయ్యేవారు కాదని మంత్రి నారా లోకేష్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా, భామిని మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రి లోకేష్ సందర్శించారు. తన చిన్నప్పుడు తాను చాలా అల్లరి చేసేవాడినని, అయితే తన కుమారుడు దేవాన్ష్ విషయంలో మాత్రం ఎన్ని పనులున్నా పేరెంట్ టీచర్ మీటింగ్‌కు తప్పకుండా వెళ్తానని లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.
Latest News