|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 02:28 PM
ఉదయం అల్పాహారం మానేయడం వల్ల దీర్ఘకాలంలో షుగర్ లెవెల్స్ పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాత్రి భోజనం తర్వాత ఉదయం వరకు గ్లూకోజ్ లభించక శరీరం కొవ్వులపై ఆధారపడుతుంది. దీనివల్ల షుగర్ లెవెల్స్ పడిపోతాయి. అంతేకాకుండా, బ్రేక్‌ఫాస్ట్ మానేయడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, ఆకలి పెరిగి అధిక బరువు పెరుగుతారని, జీవక్రియ తగ్గిపోతుందని నిపుణులు తెలిపారు. సమయం లేనివారు కనీసం పండ్లు, ఉడకబెట్టిన గుడ్లు, నట్స్ వంటివి తినాలని సూచించారు.
Latest News