|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 12:35 PM
పాణ్యం నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి శుక్రవారం కల్లూరు అర్బన్ పరిధిలోని మాధవినగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రజల అర్జీలను స్వీకరించి, అధికారులకు తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు రెడ్డి, యువత నేత ప్రభాకర్ యాదవ్, ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రా డైరెక్టర్ నాగముని, పల్లె రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను సానుభూతితో విని, పరిష్కారం చూపడం ఎమ్మెల్యే లక్ష్యంగా పెట్టుకున్నారు.
Latest News