|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 12:25 PM
నల్ల జీలకర్ర (Nigella sativa) కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతుందని ఓ పరిశోధనలో తేలింది. జపాన్ పరిశోధన ప్రకారం, ప్రతిరోజూ నల్ల జీలకర్రను ఆహారంలో చేర్చుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. నల్ల జీలకర్ర సారం కొవ్వు కణాల ఏర్పాటును నెమ్మదిస్తుందని ల్యాబ్ పరీక్షల్లో గుర్తించారు. రోజుకు ఒక టీస్పూన్ నల్ల జీలకర్ర పొడిని గోరువెచ్చని నీటితో, ఆహారంలో తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
Latest News