|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 12:18 PM
నరసరావుపేట మండలంలోని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 6న ఆరుద్రోత్సవం జరగనుంది. ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం, మాల ధరించిన స్వాములు జ్యోతి దర్శనం అనంతరం దీక్ష విరమణ చేస్తారు. స్వామివారికి ప్రత్యేక అలంకరణలు, అభిషేకాలు నిర్వహిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు, అన్న ప్రసాద వితరణ కూడా ఉంటాయని ఈవో తెలిపారు.
Latest News