|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 09:07 PM
విరాట్ కోహ్లీ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో అతను డకౌట్ అయినప్పటికీ, మూడో వన్డేలో 74 పరుగుల హాఫ్ సెంచరీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఆ ఫామ్ కొనసాగుతూ, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో కోహ్లీ పరుగుల వరద పుట్టిస్తున్నారు. మొదటి రెండు వన్డేల్లోనే అతను రెండు సెంచరీలను కొట్టాడు.ఈ అద్భుతమైన ప్రదర్శనతో కోహ్లీ తన స్థానాన్ని 2027 వన్డే ప్రపంచకప్‌లో సుస్థిరం చేసుకోవడానికి సెలక్టర్లకు సంకేతాలు పంపారు. రాయ్‌పూర్‌లో బుధవారం జరిగిన రెండో వన్డేలో 102 పరుగులు చేసి, విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో 14,492 పరుగుల మైలురాయిని చేరుకున్నారు.ప్రస్తుతం వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు సచిన్ టెండూల్కర్‌కు చెందింది. సచిన్ 463 మ్యాచ్‌లలో 44.8 సగటుతో 18,426 పరుగులు చేసి, 49 సెంచరీలు, 96 అర్థశతకాలు సాధించారు. విరాట్ కోహ్లీ ప్రస్తుతం సచిన్ కంటే 3,934 పరుగుల వెనుక ఉన్నారు.ఈ ఫామ్ కొనసాగిస్తే, 2027 వన్డే ప్రపంచకప్ వరకు కోహ్లీ సచిన్ రికార్డును అందుకునే అవకాశం ఉంది, కానీ అది సులభం కాకుండా ఉండబోతోంది. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో మొదట స్థానంలో ఉన్నారు. అతని వెంట విరాట్ కోహ్లీ 14,492 పరుగులతో, కుమార సంగక్కర 14,234, సనత్ జయసూర్య 13,430, రికీ పాంటింగ్ 13,074 పరుగులతో అనుసరించారు.
Latest News