|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:23 PM
ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారి మఠంలోని అంతర్గత విభేదాలు మరోసారి తీవ్ర రూపం దాల్చాయి. మఠం దివంగత పీఠాధిపతి వీరభోగ వసంత వేంకటేశ్వర స్వామి రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ, తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆపాలని కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తన సంతానంపై నిందలు వేస్తున్నారని, వారికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి వాస్తవాలు నిగ్గు తేల్చాలంటూ ఆమె ముఖ్యమంత్రిని కోరారు. ఈ మేరకు ఆమె విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. గత నాలుగేళ్లుగా తమ ప్రత్యర్థులు సోషల్ మీడియా వేదికగా తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా అసభ్యకర పోస్టులు పెడుతున్నారని మారుతీ మహాలక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు పోలీసులకు, ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో వారి వేధింపులు మితిమీరిపోయాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు.
Latest News