|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 08:15 PM
మన దేశం వేగంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నా, చాలా మంది విదేశీయులకు భారత్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది కేవలం మురికివాడలు మాత్రమే. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం దీనికి ప్రధాన కారణం. అయితే, ఈ నెగటివ్ మైండ్‌సెట్‌ను ప్రశ్నిస్తూ ఓ విదేశీయుడు పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. మణిపూర్‌లోని అద్భుతమైన ప్రకృతి అందాలను చూపిస్తూ, ఆస్ట్రేలియాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ డంకన్ ఈ అంశాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నించాడు. భారత్‌లోని పేదరికాన్ని మాత్రమే చూపించాలనుకునే విదేశీయులపై అతను సూటి ప్రశ్నల వర్షం కురిపించాడు.
‘‘మీరు భారత్‌కు రాగానే, నేరుగా ఢిల్లీలోని మురికివాడలను చూసేందుకు వెళతారు. ఎందుకిలా? లోక్‌టక్ సరస్సు లాంటి ప్రాంతాల వైపు ఎందుకు రావడం లేదు? ఇక్కడి సాయంకాలపు ప్రకృతి అందాలు పీస్ ఆఫ్ ఆర్ట్ లా ఉంటాయి. ఇక్కడ లోకల్స్‌తో సరదాగా గేమ్స్ కూడా ఆడొచ్చు. ఇలాంటి అందమైన ప్రదేశాలు ఎక్కడున్నాయో తెలుసుకోండి. ఇందుకోసం కొంచెం టైమ్ కేటాయించండి. భారత్‌లో కేవలం ఒకే కోణాన్ని విదేశీయులు చూస్తుండటం నిజంగా విచారకరం.’’ అని అన్నాడు.
మన దేశంలో చూడచక్కనైన ప్రదేశాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలంటే, స్థానికులను లేదా స్నేహితులను అడిగితే వారు కచ్చితంగా మంచి టూరిస్ట్ సైట్‌ను సజెస్ట్ చేస్తారని కూడా డంకన్ సూచించాడు. డంకన్ చేసిన ఈ ప్రయత్నంపై నెట్టింట పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత్‌లోని పాజిటివ్ సైడ్‌ను హైలైట్ చేసినందుకు జనాలు అతడ్ని మెచ్చుకుంటున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రకృతి సౌందర్యం నిజంగా స్వర్గంతో సమానం అని అనేక మంది కామెంట్లు చేశారు.
డంకన్ గతంలోనూ భారత్‌పై పాశ్చాత్య దేశాల్లో ఉన్న తప్పుడు అభిప్రాయాలను సరిదిద్దాలని చెప్పాడు. ‘భారత్‌పై నిత్యం ఒక పక్షపాత ధోరణి కనిపిస్తుంటుంది. అసాధారణ విషయాలను హైలైట్ చేసేందుకే ప్రయత్నాలు జరుగుతుంటాయి. వాస్తవానికి ఇది అనేక సంస్కృతులతో విలసిల్లే అందమైన దేశం, ఇక్కడి జనాలు కూడా అద్భుతం’ అని అతను తన అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేశాడు.
Latest News