|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 03:49 PM
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం త్వరలో భారత్‌కు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. గతంలో కూడా ఇలాంటి పర్యటనల్లో పుతిన్ తీరునే అనుసరించినట్టు సమాచారం. భద్రత మాత్రమే కాకుండా, ఆయన వ్యక్తిగత ఆరోగ్యం, గోప్యత కోసం అసాధారణ జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది.
పుతిన్ భారత్‌లో ఉన్నంత కాలం తినే ఆహారం, తాగే నీరు, రోజువారీ వాడే వస్తువులు పూర్తిగా రష్యా నుంచే రప్పిస్తారు. క్రెమ్లిన్ దగ్గర పనిచేసే ప్రత్యేక చెఫ్‌లు వండిన భోజనాన్ని అత్యాధునిక మొబైల్ ల్యాబొరేటరీలో పరీక్షించి మాత్రమే సర్వ్ చేస్తారు. విషపూరితం లేదా ఏదైనా రసాయన జాడ కలుస్తుందేమోనన్న అనుమానంతో ఈ జాగ్రత్త తీసుకుంటారట.
అంతకంటే ఆసక్తికరంగా ఉన్న విషయం – పుతిన్ వాడే టాయిలెట్ కూడా రష్యా నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తారు. ఆయన మలమూత్ర విసర్జనలను కూడా భారత్‌లో వదిలిపెట్టకుండా, సీలు వేసిన కంటైనర్లలో రష్యాకు తిరిగి తీసుకెళ్తారని సోర్సెస్ చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల ఆయన డీఎన్ఏ లేదా ఆరోగ్య సమాచారం ఎవరికీ అందకుండా చూసుకుంటారట.
అదనంగా పుతిన్ సాధారణ మొబైల్ ఫోన్ ఏమాత్రం వాడరు. బదులుగా ఎక్కడి నుంచి వచ్చినా ప్రత్యేకమైన సురక్షిత బూత్‌లోనే టెలిఫోన్ సంభాషణలు జరుపుతారు. ఈ రకమైన అతి కట్టుదిట్టమైన ప్రోటోకాల్ ప్రపంచ నాయకుల్లో ఎవరూ ఇంతలా పాటించడం లేదని, అందుకే పుతిన్ పర్యటన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది.