|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 03:10 PM
పగిలిపోయిన దేవుడి విగ్రహాలు, చిరిగిపోయిన దేవతా పటాలు ఇంట్లో ఉంచుకుంటే భక్తి భావన క్రమంగా తగ్గిపోతుందని ప్రముఖ వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటివి ఇంటి సానుకూల శక్తిని దెబ్బతీసి, మనసులో గందరగోళం పెంచుతాయని వారి అభిప్రాయం. అందుకే ఇంట్లో ఉన్న పాడైపోయిన విగ్రహాలను, ఫోటోలను వెంటనే తొలగించడం ఎంతో ముఖ్యమని నొక్కి చెబుతున్నారు.
పగిలిన లేదా చిరిగిన విగ్రహాలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం వాటిని పవిత్రంగా విడిచిపెట్టాలి. ప్రవహించే నది, కాలవ లేదా సమీపంలోని పవిత్ర జలాల్లో నిమజ్జనం చేయడం ఉత్తమ మార్గం. ఇలా చేయడం వల్ల దేవతా శక్తి సమర్పణతో తిరిగి ప్రకృతిలో కలిసిపోతుందని నమ్మకం.
నిమజ్జనం సాధ్యం కాకపోతే మరో మార్గం కూడా ఉంది. ఆ విగ్రహాలను దగ్గరలోని ఏదైనా ఆలయంలోని చెట్టు కింద లేదా పీఠం సమీపంలో గౌరవంగా ఉంచాలి. ఇది దేవుని శక్తిని ఆలయ ప్రాంగణంలోనే కొనసాగించే మార్గంగా భావిస్తారు. చాలా మంది భక్తులు ఈ పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు.
కాగితంపై ముద్రించిన పాత దేవుడి పటాలు ఉంటే వాటిని నేరుగా అగ్నికి ఆహుతి ఇవ్వడం శ్రేష్ఠం. ఆ బూడిదను నీటిలో కలిపి చెట్టు మొదళ్లో పోయడం వల్ల పూర్తి సమర్పణ జరుగుతుంది. ఈ చిన్న చర్యలతోనే ఇంటి వాస్తు శుద్ధి, మనసులో భక్తి శుద్ధి రెండూ నిండుగా ఉంటాయి.