|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 11:36 PM
మనం ఎవరినైనా సెలబ్రిటీలని చూసినప్పుడు అబ్బా ఎంత బాగున్నార్రా బాబు అనుకుంటాం. మేకప్ వల్ల కొంతమంది అలా మెరిసిపోతున్నారనుకుంటారు. కానీ, అది కొంతమాత్రమే నిజం. మనతో పోలిస్తే వారు కాస్తా గ్లామర్‌గానే ఉంటారు. దీనికోసం వారు ఫాలో అయ్యేవి చాలా ఉంటాయి. మనలాగా వారు ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినడం, ఎలా పడితే అలా బయటికి వెళ్లడం చేయరు. వారి స్కిన్‌ని కాపాడుకుని లైఫ్‌లో అందంగా కనిపించేందుకు చాలానే ఫాలో అవుతారు. అవన్నీ కూడా చాలా సింపుల్ కూడా. వాటిని ఫాలో అయితే మేకప్ లేకపోయినా మనం కూడా వారిలానే మెరుస్తాం.
ఎండ తగలకుండా
అంటే సెలట్రిటీలు అస్సలు ఎండలో ఉండారా అంటే అది కాదు. అవసరమైతే తప్పా ఎండలో ఉండరు. ఒకవేళ ఎండలో ఉన్నా కూడా ఎండ నుంచి వారి స్కిన్‌ని కాపాడుకునేందుకు సన్‌స్క్రీన్ లోషన్ రాయడం, గొడుగు వాడడం చేస్తారు. దీంతో సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాల నుండి స్కిన్‌ని కాపాడుకోవచ్చు. కాబట్టి, మీరు కూడా తప్పకుండా వీటిని ఫాలో అవ్వండి.
జంక్ ఫుడ్, షుగర్ జోలికి వెళ్లకపోవడం
మనం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేవరకూ జంక్ ఫుడ్, షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇందులో ఏదో ఒకటి ఏదో ఓ రూపంలో తీసుకుంటాం. కానీ, సెలబ్రిటీలను ఎవరినైనా చూడండి. వారి ఇంటర్వ్యూలు చూడండి. వీటికి చాలా వరకూ దూరంగా ఉంటారు. జంక్ ఫుడ్, షుగర్ కారణంగానే మన బాడీలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మొటిమలు వస్తాయి. స్కిన్ డల్‌గా మారుతుంది. కాబట్టి, వీలైనంత వరకూ దూరంగా ఉండడం మంచిది.
రోజూ కనీసం మూడున్నర లీటర్ల నీరు తాగడం
నీరు తాగాలంటే మనకి మహా బద్ధకం. కానీ సెలబ్రిటీస్ నీటిని అస్సలు నిర్లక్ష్యం చేయరు. రోజుకి కనీసం 3 నుంచి మూడున్నర లీటర్ల నీరు తాగేలా చూస్తారు. నీరు ఎక్కువగా తాగడం వల్ల బాడీలోని ట్యాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి. పైగా స్కిన్ నిగనిగలాడుతుంది. మీరు నీటి బదులు కొబ్బరినీరు కూడా తాగొచ్చు.
యాంటీ ఏజింగ్ ఫుడ్స్
అవును యాంటీ ఏజింగ్ క్రీమ్స్‌లానే యాంటీ ఏజింగ్ ఫుడ్స్ కూడా ఉంటాయి. రోజూ వాటిని మన డైట్‌లో యాడ్ చేసుకోవడం మంచిది. స్ట్రాబెర్రీ, అవకాడో, పాలకూర, వాల్‌నట్స్, బాదం, డార్క్ చాక్లెట్, గ్రీన్ టీలాంటి వాటిని మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. వీటన్నింటిలో గుడ్ ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీ స్కిన్‌ని యంగ్ అండ్ గ్లోయింగ్‌గా చేస్తాయి.
అందంగా కనిపించేలా చేసే అలవాట్లు
8 గంటల పాటు కచ్చితమైన నిద్ర
ఫుడ్, డ్రింక్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు నిద్ర కూడా చాలా ముఖ్యం. నిద్ర పోవడం అనేది కూడా మన హెల్త్‌ని స్కిన్‌ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది. ఎంత బిజీగా ఉన్నా రోజుకి కనీసం 8 గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకోండి. దీని వల్ల కచ్చితంగా మీరు హెల్దీగా మారడమే కాకుండా స్కిన్ కూడా హెల్దీగా మారుతుంది. చర్మం కూడా రిపేర్ అవుతుంది. కాబట్టి, నిద్రపోండి.
Latest News