|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 11:21 PM
ఒకరికి కింద పని చేసే బదులు చిన్నదైనా సొంత బిజినెస్ ఉండాలని భావించే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. దీంతో యువత ఎక్కువగా సొంత వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు అందించే వ్యాపారాలు చాలానే ఉంటాయి. కొన్ని వ్యాపారాలకు ఒక్కసారి పెట్టుబడి పెట్టి 365 రోజుల పాటు లాభాలు అందుకోవచ్చు. అలాంటి వాటిల్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ ఒకటి. ఒక్క సారి ఏజెన్సీ ప్రారంభించి కస్టమర్లను సంపాదించుకోలగిలితే ఏడాది పొడవునా సీజన్‌తో సంబంధం లేకుండా వ్యాపారం కొనసాగుతుంది. అలాగే గ్యాస్ డిస్టిబ్యూటర్లకు చమురు కంపెనీలు మంచి కమీషన్లు సైతం ఇస్తున్నాయి. దీంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు.
గ్యాస్ ఏజెన్సీని ప్రారంభించేందుకు ఇప్పుడు ఒక సువర్ణావకాశం ఉంది. చమురు మార్కెటింగ్ లో 30 ఏళ్లకు పైగా ప్రస్థానం కలిగి ఉన్న ప్రముఖ కంపెనీ గో గ్యాస్ గ్యాస్ ఏజెన్సీలకు ప్రకటన చేసింది. ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ప్రచారం చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో హోర్డింగులు సైతం మీరు చూసే ఉంటారు. అలాగే సోషల్ మీడియా అకౌంట్ల ద్వారానూ గో గ్యాస్ ఎల్‌పీజీ సిలిండర్ ఏజెన్సీల కోసం ప్రకటన చేసింది. 'మీరు జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో మంచి లాభాలు అందించే బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే భారత్‌లోని ప్రముఖ ఎల్‌పీజీ బ్రాండ్ గో గ్యాస్‌తో చేతులు కలపండి. ఈరోజే మీ సొంత డీలర్‌షిప్ ప్రారంభించండి' అని రాసుకొచ్చింది.
ఎల్‌పీజీ గ్యాస్ ఏజెన్సీ ప్రారంభించేందుకు చాలా తక్కువ పెట్టుబడి అవసరమవుతుందని గో గ్యాస్ తెలిపింది. అలాగే ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ తీసుకోవడం లేదని, రిజిస్ట్రేషన్ ఫీజు సైతం లేదని పేర్కొంది. పూర్తి వివరాలకు 1800 210 7999 లేదా www.gogas.coను సంప్రదించాలని కోరింది. ఈరోజే ఫోన్ చేసి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారంలోకి అడుగుపెట్టాలని సూచించింది. వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూకు పిలుస్తారు. నిబంధనల మేరకు గ్యాస్ ఏజెన్సీ యజమానులను ఎంపిక చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తుల జాబితాను వెబ్‌సైట్లో పేర్కొంటారు. గ్యాస్ ఏజెన్సీ ఏర్పాటుకు కావాల్సిన స్థలం, స్టోరేజ్ గో డౌన్ ఏర్పాటు చేసే స్థలాన్ని పరిశీలించి అన్ని నిబంధనల మేరకు ఉంటే మంజూరు చేస్తారు.
Latest News