|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 10:41 PM
ప్రఖ్యాత పుణక్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీలో ఎలాంటి మార్పు లేదు, తాకిడి కొనసాగుతోంది. భక్తులు తిరుమలకు భారీగా చేరుకుంటున్నారు. వేలాది మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు.ఆదివారం ఒకే రోజు 68,187 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 25,559 మంది తలనీలాలు సమర్పించి, తమ మొక్కులు చెల్లించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.47 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 14 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేకుండా వచ్చిన భక్తులకు సర్వదర్శనానికి 8 నుండి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లలో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు మంచినీరు, పాలు, అల్పాహారాలను అందించారు.కాగా, తిరుమల తరహా ఆలయాల్లో భక్తులకు అన్నప్రసాదాలు అందించాలని టీటీడీ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. అలాగే, అవి కొనసాగుతున్న అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాల్లో అన్నప్రసాదాలు తయారు చేసే సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, ఇంకా రోజు వారీ పంపిణీపై నివేదిక తయారు చేయాలని సూచించారు.అనిల్ కుమార్ సింఘాల్ టట్టు, ఎవరైనా అన్య మతస్తులు ఉంటే వారిని గుర్తించి, తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక సిద్ధం చేయాలని, దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలోని ఆలయాలకు వేదపారాయణదారులు, అర్చకుల నియామకాలను పరిగణనలోకి తీసుకొని ప్రతి ఆలయానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ రూపొందించాలని చెప్పారు. ఈ పనులు వచ్చే సమావేశానికి పూర్తిచేయమని ఆయన ఆదేశించారు.టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాల ప్రకారం, దేవాదాయ శాఖ అధికారులతో చర్చించి పోటు వర్కర్ల పేర్ల మార్పును పూర్తి చేయాలని, అర్భన్ డెవలప్మెంట్ సెల్‌ను పటిష్టం చేయడానికి తగిన సిబ్బందితో కార్యాచరణ సిద్ధం చేయాలని చీఫ్ ఇంజనీర్‌కి ఆదేశించారు.శ్రీనివాస కల్యాణ కార్యక్రమాలు సజావుగా నిర్వహించడానికి ముందస్తుగా ఈవెంట్‌ల క్యాలెండర్ సిద్ధం చేయాలని కూడా తెలిపారు. భక్తులకు ముందుగానే కల్యాణం వివరాలు అందించడం వల్ల ఎక్కువ మంది పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతారని చెప్పారు.అమరావతి వెంకటపాలెంలో ఉన్న టీటీడీ శ్రీ వేంకటేశ్వర ఆలయ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, 25 ఎకరాల్లో ఇప్పటికే ఉన్న ఆలయంతో పాటు కొత్త కల్యాణ కట్ట, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, ప్రాకారం, గోపురాలు, పుష్కరిణి తదితర నిర్మాణాలపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
Latest News