|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 06:32 PM
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఓ మహిళా వ్యాపారవేత్తను ఓ ప్రైవేటు కంపెనీ ఎండీ తుపాకీతో బెదిరించి వేధింపులకు పాల్పడ్డాడు. ఫ్రాంకో-ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ ఎండీ జాయ్ జాన్ పాస్కల్ పోస్ట్ మీటింగ్ ఉందంటూ బాధితురాలిని తన ఆఫీసుకు పిలిచినట్లు వివరించింది. తుపాకీతో బెదిరించి దుస్తులు తీయించాడని, నగ్నంగా ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేశాడని తెలిపింది. అవి బయటపెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడని, పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జాన్, మరో ఐదుగురిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Latest News