|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 06:26 PM
ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు సోమవారం పాఠాలు బోధించారు. ఉరవకొండ మండలం బూదివి ప్రాథమిక పాఠశాలను పరిశీలించి, ఒక గంట పాటు విద్యార్థులకు పాఠంచెప్పారు . మంత్రి అడిగిన ప్రశ్నలకు పిల్లలు సమాధానాలు చెప్పగా, వారి తెలివితేటలు చూసి ఆయన ఆశ్చర్యపోయారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో చేరాలని ఆయన వారిని ప్రోత్సహించారు.
Latest News